Home సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూ.. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మాస్ జాతర! – Jananethram News

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూ.. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మాస్ జాతర! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్), హరీష్ శంకర్ కాంబినేషన్.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)తో అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ నేడు (మార్చి 14) సాయంత్రం 6:30 గంటలకు విడుదలైంది. “ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం” అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, గన్ పట్టుకుని నడిచి వచ్చే స్టైల్ పాత ‘గబ్బర్ సింగ్’ రోజులను గుర్తుచేస్తున్నాయి.

పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ఈ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచిన సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ మాస్ పల్స్‌ను కరెక్ట్‌గా పట్టుకున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird