Home Latest News మహిళలకు నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | మహిళలకు నెలవారీ సెలవు| సుప్రీంకోర్టు| ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్| న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి| కాలం సమయం| కేరళ రాష్ట్రం| PM MODI| స్త్రీలు – Jananethram News

మహిళలకు నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | మహిళలకు నెలవారీ సెలవు| సుప్రీంకోర్టు| ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్| న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి| కాలం సమయం| కేరళ రాష్ట్రం| PM MODI| స్త్రీలు – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


మహిళలకు నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాంటి విధానం అమలులోకి వస్తే మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో యజమానులు వెనుకంజ వేసే అవకాశం ఉందని ధర్మాసనం.

ఉద్యోగినులు, విద్యార్థులకు నెలసరి సెలవులు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ని ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. నెలసరి సెలవులను చట్టబద్ధంగా తప్పనిసరి చేస్తే యువతులు తాము ఇతర ఉద్యోగులతో సమానం కాదనే భావనకు లోనయ్యే అవకాశం ఉందని, ఇది వారి ప్రారంభానికి ఆటంకంగా మారుతుందని అభిప్రాయపడింది.

నెలసరి సెలవుల అంశంపై భారతీయ సమాజంలో చాలాకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ సెలవులు మహిళలకు ఉపశమనంగా ఉంటారని, మరికొందరు ఇది లింగ వివక్షను మరింత పెంచే ప్రమాదం ఉందని అంటున్నారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలు, అలాగే అనేక ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగినులకు నెలసరి సెలవులను అమలు చేస్తున్నాయి.

జాతీయ స్థాయిలో నెలసరి సెలవు అమలు చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మూడు రోజుల సెలవులు కోరినట్లు తెలిపారు.

అయితే న్యాయమూర్తులు మాత్రం అలాంటి విధానం మహిళలకు ప్రయోజనం కలిగించదని స్పష్టం చేశారు. ఇది లింగ సంబంధిత మూసధోరణులను మరింత బలపరచడంతో పాటు మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు మహిళలను నియమించుకోవడంలో వెనుకంజ వేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

కేరళ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో ఆడపిల్లలకు నెలసరి సమయంలో లీవ్ రిలాక్సేషన్ అందించారు. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా మహిళలకు స్వచ్ఛందంగా నెలసరి సెలవులు ఇస్తున్నాయి. మహిళలకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird