
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దొర కన్నుమూశారు. గత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం డయాలసిస్ చేయించుకునేందుకు నిమ్స్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు బాత్రూమ్ పడిపొయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్‌కు తరలించి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 1965 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏపీ అయిన దొర, 1996 నుండి 2002 వరకు డీజీపీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు.
ఏపీ డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్‌గా మరియు కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తన వృత్తి జీవితంలోని అనుభవాలను వివరిస్తూఅనే పేరుతో ఆయన తన ఆత్మకథను కూడా రచించారు. ఆయన పట్ల ప్రస్తుత రాజకీయ ప్రముఖులు, మాజీ మృతి మరియు ఐపీఎస్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవ, పోలీస్ శాఖలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరువలేనివని కొనియాడారు.

C.E.O
Cell – 9866017966

