Home సినిమా ఓజి ప్రియాంక మోహన్ ఆవేదన.. డబ్బులు ఇచ్చి ఎందుకు చేయించారు – Swen Daily

ఓజి ప్రియాంక మోహన్ ఆవేదన.. డబ్బులు ఇచ్చి ఎందుకు చేయించారు – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo


-ప్రియాంక మోహన్ గురించి ఎందుకు అలా చెప్తున్నారు
-అసలు సోషల్ మీడియాలో ఏముంది
-అభిమానుల ఆవేదన

అందానికి సరికొత్త నిర్వచనాన్ని వెతికేంత అందం ‘ప్రియాంక మోహన్'(ప్రియాంక మోహన్)సొంతం. తన కంటు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే తన నుంచి సినిమా వచ్చిన రోజు థియేటర్ కి వెళ్లి కొంత మంది ప్రేక్షకులను జస్ట్ టచ్ చేస్తే చాలు మేము ప్రియాంక మోహన్ అభిమానులని చెప్పేస్తారు. గత సెప్టెంబర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)’ఓజి’లో కన్మణిగా మెప్పించింది. ఆ థియేటర్ దగ్గర కూడా సేమ్ సిత్యువేషన్ కనపడిందంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్ని విషయాలతో అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఆ మాటలేంటో చూద్దాం.

రీసెంట్ గా ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం జరుగుతుంది. ద్వేషాన్ని చిమ్ముతు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి చేయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీని వెనక ఒక టీం పని చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా అన్నీ చూశాను. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని క్రిందకు లాగే వాళ్లు, మనపై చెడు ప్రచారం చేసేవాళ్లు ఉంటారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. గతం గురించి పట్టించుకునే పరిస్ధితుల్లో నేను ఇప్పుడు లేను. సినీ పరిశ్రమ నిలకడ లేని పరిశ్రమ. ఇక్కడ ఎవరికైనా నాలాంటి పరిస్ధితి ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిస్థితులే మనల్ని దృఢంగా మారుస్తాను. నా జీవితంలో ఎన్నో చూశాను. ఈ ట్రోలింగ్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఇక్కడ అణగదొక్కడానికి కొంత మంది ఉంటారని ఒకింత ఆవేదనతోనే చెప్పింది.

ఇది కూడా చదవండి: Nagarjuna: నాగార్జున అందానికి ఆ జపనీస్ వంటకమే కారణమా! ఎలా బయటకొచ్చింది

అయితే సౌత్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రియాంక మోహన్ పై నెగిటివ్ ప్రచారం చెన్నైకి చెందిన ఓ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీ వెనకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఆ కంపెనీ నుంచి ప్రియాంక బయటకి వచ్చాకే తనపై ట్రోల్స్ జరుగుతున్నాయనేది వారి నమ్మకం. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది తారల మీడియాని ఆ కంపెనీ చూస్తుంది. గత కొన్ని నెలల నుండి ప్రియాంక పై నెగిటివ్ పోస్టులు, దారుణమైన కామెంట్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత కెరీర్ చూసుకుంటే ‘మేడ్ ఇన్ కొరియా'(మేడ్ ఇన్ కొరియా) అనే తమిళ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా రేపు స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ్ లో సినిమా, కన్నడలో ఆమె ఖాతాలో ఒకటి 2019లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడలో పదమూడు మరో చిత్రాల వరకు చేసింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird