Home Latest News పెళ్లికి ఒప్పుకునే ముందు అబ్బాయిలను ఈ విషయాలు తప్పకుండా అడగాలి..! | పెళ్లి చేసుకునే ముందు మనిషిని తప్పక అడగాల్సిన ప్రశ్నలు| వివాహానికి ముందు మగవారితో చర్చించవలసిన ముఖ్యమైన విషయాలు| వివాహానికి అవును అని చెప్పే ముందు మనిషిని అడగవలసిన ముఖ్యమైన ప్రశ్నలు – Jananethram News

పెళ్లికి ఒప్పుకునే ముందు అబ్బాయిలను ఈ విషయాలు తప్పకుండా అడగాలి..! | పెళ్లి చేసుకునే ముందు మనిషిని తప్పక అడగాల్సిన ప్రశ్నలు| వివాహానికి ముందు మగవారితో చర్చించవలసిన ముఖ్యమైన విషయాలు| వివాహానికి అవును అని చెప్పే ముందు మనిషిని అడగవలసిన ముఖ్యమైన ప్రశ్నలు – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది. అబ్బాయి విషయంలో అయినా, అతని కుటుంబం పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా.. ఏ సమస్య వచ్చినా అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

ఒకప్పుడు సమస్య వస్తే.. సర్దుకుపోవాలని అనుకునేవారు అమ్మాయిలు. కానీ.. నేటికాలంలో అలా లేదు.. సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు ముఖ్య కారణం.. అబ్బాయిలు, అతని కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆమె వారిని ఎదిరించడానికి సిద్దపడుతోంది, ప్రశ్నిస్తోంది, కానీ ఒత్తిడి అనుభవించేది కూడా అమ్మాయిలే. ఈ ఏమీ లేకుండా వివాహం తర్వాత జీవితం బాగుండాలంటే.. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ప్రతి అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

కెరీర్ లక్ష్యం..

సంబంధం ఫైనల్ కాబోతుంటే లేదా ఇప్పటికే ఫైనల్ అయి ఉంటే, కాబోయే భర్తను అతని కెరీర్ లక్ష్యాల గురించి అడగాలి. దీని గురించి ముందుగానే చర్చించడం మంచిది. అతను తన కెరీర్ గురించి కాదు.. అమ్మాయి కెరీర్‌కు మద్దతు ఇస్తాడా? లేదా.. ఈ విషయాలు ముందే మాట్లాడటం మంచిది. ఎందుకంటే వివాహం తర్వాత కెరీర్ ను పక్కన పెట్టి ఇంటిని చూసుకోమని చెప్పేవారు చాలా మంది ఉంటారు.

డబ్బు..

డబ్బు గురించి మాట్లాడితే.. ఈ అమ్మాయి మనీ మైండెడ్ అని ఎవరైనా అనుకుంటారేమో అని వెనకడుగు వేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత జీవితంలో చాలా వరకు డబ్బు కారణంగా గొడవలు వస్తాయి. కాబోయే భర్తతో ముందుగానే డబ్బు నిర్వహణ గురించి చర్చించాలి. అతను డబ్బును ఎలా తెలివిగా ఆడ చేస్తాడో, అతను అప్పుల్లో ఉన్నాడా లేదా అనే విషయాలు మాట్లాడాలి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తారనే విషయం కూడా చర్చించాలి.

లైఫ్ స్టైల్..

సంబంధాన్ని నిర్ధారించుకునే ముందు అతని జీవనశైలి ప్రశ్నలు అడగాలి. భర్త జీవిత లక్ష్యాలను ప్రతి అమ్మాయి అడిగి తెలుసుకోవాలి. అతనికి ప్రయాణం చేయడం ఇష్టమా? అతనికి సినిమాలు చూడటం ఇష్టమా? రోజును ఎలా మలచుకుంటాడు.. ఇవన్నీ చర్చిస్తే.. వీటి సమాధానాల మీదే అతని వ్యక్తిత్వం కూడా స్పష్టంగా తెలుస్తుంది.

పర్సనల్ సేవింగ్స్..

సంబంధం ఇక ఖాయం అనుకున్నప్పుడు వారితో వ్యక్తిగత పొదుపు గురించి చర్చించాలి. వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. వారి ప్లానింగ్ ప్రకారమే భార్య భవిష్యత్తు అతనితో ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. దీని వల్ల సమస్యలు ఉంటే ముందే పరిష్కారమవుతుంది.

లోన్ లు, అప్పులు..

కాబోయే భర్తకు అప్పులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అతని కుటుంబానికి పెద్ద అప్పులు ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్లు ఉన్నాయా అని కూడా ముందుగానే అడగాలి.

పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందే అమ్మాయిలు కాబోయే భర్తను అడిగితే వివాహం తర్వాత జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird