
ప్రస్తుతం గ్రాఫిక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. అయితే సీజీ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కెమెరామెన్ పాత్ర అత్యంత కీలకం. తాజాగా ‘వదలా’ మూవీ ఈవెంట్ లో ప్రముఖ సినిమాటోగ్రా ఛోటా కె. నాయుడు(చోటా కె నాయుడు ) ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీజీ సినిమాల్లో కెమెరామెన్ పోరాటం
ఇప్పుడు సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ కాకుండా, సీజీ కోసం ప్రత్యేకంగా ఒక టెక్నీషియన్ ఉన్నాడు. ఆ టెక్నీషియన్ అనుమతి లేకుండా ఇప్పుడు ఒక్క ఫ్రేం కూడా తీయడం లేదని ఛోటా కె. నాయుడు వివరించారు.
“నేను పెద్ద పుడింగిని, నాకు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి అని నా ఇగో చూపిస్తే ఇక్కడ వర్కవుట్ అవ్వదు” అని ఛోటా చాలా నిజాయితీగా చెప్పారు.
సీజీ టెక్నీషియన్ కి ఏం కావాలో అదే చేస్తున్నాం అన్నారు. సీజీ టెక్నీషియన్ అప్రెంటిస్ అయినా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడైనా సరే.. వాళ్లకు ఏం కావాలో అదే అందించినట్లు ఆయన చెప్పారు. అయితే కొందరు అవుట్ పుట్ బాగుంటే వాళ్ళు క్రెడిట్ తీసుకొని, అవుట్ పుట్ బాలేకపోతే మాత్రం సినిమాటోగ్రాఫర్స్ ని నిందిస్తున్నారని ఛోటా. నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అంజి ‘తల ఎత్తుకుని’.. విశ్వంభర ‘తల వంచుకుని’..
గతంలో ‘అంజి’ వంటి అద్భుత దృశ్య కావ్యాన్ని కెమెరామెన్ గా పనిచేసిన ఛోటా కె. నాయుడు, ఇప్పుడు ‘విశ్వంభర'(విశ్వంభర) సినిమాకు పని చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ పనిచేసే విధానం మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంజి సినిమా కోసం మేము ఎంతో గర్వంగా, తల ఎత్తుకుని పని చేశాం. విశ్వంభర విషయానికి వస్తే, తల వంచుకుని పని చేయాల్సి వస్తోంది. దీనికి కారణం ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడింది. అంత భారీ సినిమా తీస్తున్నప్పుడు, తన అహం కంటే సినిమా అవుట్‌పుట్ ముఖ్యమని అన్నారు. ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుని, ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ శ్రమిస్తోందని ఛోటా కె. నాయుడు తెలిపారు.
మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలు, ఎక్సక్లూసివ్‌లు, తాజా అప్‌డేట్స్ ఇంటర్వ్యూ కోసం మా ‘తెలుగువన్ సినిమా'(TeluguOne Cinema) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

C.E.O
Cell – 9866017966


