
ఆదివారం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ వీవీ ఆదిత్య ప్యానెల్ ఘన విజయం సాధించారు. దర్శకుల సంఘ అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా వి. సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ట్రెజరర్‌గా సాయి రాజేశ్ ఎన్నికయ్యారు.
ఇప్పటివరకు జరిగిన సంఘం ఎన్నికల్లో ఇదే హైయెస్ట్ మెజారిటీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్ వద్ద స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు.
అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “ఒకప్పుడు దర్శకుల సంఘం ఇండస్ట్రీని లీడ్ చేసింది. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీఎన్ ఆదిత్య సారథ్యంలోని కమిటీ దర్శకుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. గెలిచిన వాళ్లే కాదు ఓడిన వాళ్లు కూడా మనవాళ్లే.. అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని కోరుతున్నాం.” అన్నారు.
ఎన్. శంకర్ మాట్లాడుతూ.. “నూతన కమిటీ మీద ఎంతో నమ్మకం పెట్టి దర్శకుల సంఘ సభ్యులు గెలిపించారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేలా కొత్త బాడీ పనిచేస్తుందని కోరుకుంటున్నాను.” అన్నారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ.. “వీఎన్ ఆదిత్య గారంటే అందరికీ చాలా గౌరవం. ఆయన నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో కూడా ఉన్నారు. కొత్త దర్శకులను తీసుకెళ్లి నిర్మాతలకు కథలు చెప్పి సినిమాలు చేసి ప్రోత్సహిస్తారు. ఆయన దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలవడం సంతోషంగా ఉంది.” అన్నారు.
దర్శకుల సంఘం ట్రెజరర్ సాయి రాజేశ్.. “దర్శకుల సంఘంలో ఎన్నడూ లేనంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ” మేము ఇచ్చిన 8 వాగ్ధానాలు మమ్మల్ని గెలిపించాయని మేము నమ్ముతున్నాము అన్నారు.
దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య.. “గత సంవత్సరం సంక్షేమ సంఘంలో మంచి కార్యక్రమాలు జరిగాయి. మా ప్యానెల్‌లో 18 మంది పోటీ చేస్తే 16 మంది గెలిచారు. అంటే మాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ గెలుపునకు సాయి రాజేశ్ ఎంతో కృషి చేశారు. తరుపున నిలించారు. అన్నారు.


