Home సినిమా 38 జంటల విడాకుల్ని ఆపిన మూవీ.. మీకు శతకోటి వందనాలు – Jananethram News

38 జంటల విడాకుల్ని ఆపిన మూవీ.. మీకు శతకోటి వందనాలు – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-సినిమాకి ఉన్న శక్తి మరోసారి బయటపడింది
-38 జంటలని నిజంగానే కలిపిందా
-ఇంతకీ ఆ సినిమా ఏంటి! ఎక్కడ జరిగింది

జోనర్ తో సంబంధం లేదు. మంచి సినిమా పడాలే కానీ, దేవతలు సైతం థియేటర్ లో సినిమా చూసి వెళ్తారనే నానుడి మూవీ లవర్స్ లో ఎప్పట్నుంచో ఉంది. అంతటి శక్తి సినిమా సొంతం. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యశీలి కూడా. అసలు సినిమా అనేది ఈ నేలపై అడుగుపెట్టకపోతే మనిషికి మంచి, చెడు చెప్పే వాళ్ళు కూడా ఉండేవారు కాదు. అంత సీన్ ఉందా అనే డౌట్ వ్యక్తం చేసే వాళ్ళ కళ్ళు తెరిపించేలా సిల్వర్ స్క్రీన్ కొన్ని చిత్రాలు మెరుస్తుంటాయి. మరి ఆ మూవీ ఏంటి? చేసిన మంచి ఏమిటో చూద్దాం.

ఇరుగపట్రు(Irugapatru) ఈ మూవీ రిలీజ్ కాకముందు సుమారు ముప్పై ఎనిమిది జంటలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాలనుకున్నారు. కానీ వాళ్ళందరు ‘ఇరుగపట్రు’ చూసాక తమ మనసు మార్చుకొని విడాకుల ఆలోచనకి మంగళం పాడి తమ బంధాన్ని కొనసాగించారు. ఈ సంఘటన త్రిచి ప్రాంతంలో జరిగింది. ఈ స్వయంగా విక్రమ్ ప్రభు నే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారడంతో మూవీ లవర్స్ ఇరుగపట్రు దగ్గర టేక్ ఆఫ్ అయ్యారు. కనీసం విడాకుల విషయంలో వెయ్యి జంటల మనసు మార్చుకోవాలని ప్రిపేర్ అయ్యామని కూడా విక్రమ్ ప్రభునైనా కోరుకుంటున్నారు.

కూడా చదవండి: allu arjun: ధురంధర్ 2 నా ఉస్తాద్ భగత్ సింగ్ నా.. హైదరాబాద్ ఖ్యాతిని పెంచిన అల్లు అర్జున్

ఇరుగపట్రు కథ విషయానికి వస్తే మూడు జంటల మధ్య అహం, అపార్ధం, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. దీనితో విడిపోవాలనుకుంటారు. కానీ ఆ తర్వాత తమ సమస్యను తెలుసుకొని కలిసి బతకాలి. దాదాపుగా విడాకులు తీసుకునే వాళ్లందరికీ అవే సమస్యలు. దీనితో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే చాలా జంటలు కలిసాయి. 2023లో వచ్చిన ఈ మూవీ తెలుగు అనువాదంలో కూడా అందుబాటులో ఉంది. మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విడిపోవడానికి రెడీ గా ఉంటే ఇరుగపట్రు చూపించండి. ఖచ్చితంగా కలిసి ఉంటారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird