Home Latest News భారత్ వరల్డ్ కప్ విజయాల్లో ఆసక్తికర సెంటిమెంట్! | ఇండియా క్రికెట్| T20 వరల్డ్ కప్|న్యూజిలాండ్| జస్ప్రీత్ బుమ్రా| సంజు శాంసన్| అభిషేక్ శర్మ| అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం| క్రికెట్ ప్రపంచ కప్|టిమ్ సీఫెర్ట్| అర్ష్దీప్ సింగ్| హర్భజన్ సింగ్| సర్దార్ బల్వీందర్ సంధు| సునీల్ వాల్సన్| BCCI – Jananethram News

భారత్ వరల్డ్ కప్ విజయాల్లో ఆసక్తికర సెంటిమెంట్! | ఇండియా క్రికెట్| T20 వరల్డ్ కప్|న్యూజిలాండ్| జస్ప్రీత్ బుమ్రా| సంజు శాంసన్| అభిషేక్ శర్మ| అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం| క్రికెట్ ప్రపంచ కప్|టిమ్ సీఫెర్ట్| అర్ష్దీప్ సింగ్| హర్భజన్ సింగ్| సర్దార్ బల్వీందర్ సంధు| సునీల్ వాల్సన్| BCCI – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్2026ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై96 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను అందుకుంది. రెండు వన్డేలను, మూడు టీ20లు కలిపి మొత్తంగా ఐదు ప్రపంచ కప్‌ భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్రపంచ కప్ విజయాల వెనక ఉన్న ఓ ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది.

1983లో భారత్ జట్టు తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. తాజాగా టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకుంది. 1983 నుంచి తాజాగా టీ20 వరల్డ్ కప్2026 వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో తప్పనిసరిగా ఒక సర్ధార్, ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. వారు లేకుండా ఇప్పటి వరకు భారత్ ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవకపోవడం విశేషం.1983లో సర్దార్ బల్విందర్ సంధూ , కేరళ ఆటగాడు సునీల్ వాల్సన్‌లతో ఈ సెంటిమెంట్ మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో హర్భజన్ సింగ్, కేరళ ప్లేయర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషించారు.

అలానే 2024, 2026 టీ20 ప్రపంచ కప్‌లలో సంజు శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) సంప్రదాయాన్ని కొనసాగించారు. టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీని గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు చేశాడు. అది గాలివాటం కాదు… అని నిరూపిస్తూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి జట్టు టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే 2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి అర్ష్‌దీప్‌ సింగ్‌.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్‌ సర్దార్‌ అనిపించుకున్నాడు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird