Home Uncategorized ఉత్తమమహిళావ్యాపారవేత్తగా ‘కూరపాటి మంజుల’ ఎంపిక

ఉత్తమమహిళావ్యాపారవేత్తగా ‘కూరపాటి మంజుల’ ఎంపిక

by Jananethram News
0 comments

జననేత్రంన్యూస్ మార్చి09//తెలంగాణ భాష సంస్క్రతిక శాఖ మరియు మాక్షా గ్లోబల్ ఫౌండేషన్ చే ‘గోల్డన్ నంది’ అవార్డు బహుకరణ
పత్రికా ప్రకటన-ఖమ్మం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ భాష సంస్క్రతిక శాఖ మరియు మాక్షా గ్లోబల్ ఫౌండేషన్ ,ఎం జి ఎఫ్ టి వి చే ఖమ్మం నగరానికి చెందిన వ్యాపార వేత్త కూరపాటి మంజుల గోల్డన్ నంది అవార్డుకు ఎంపికయ్యారు.ఈమేరకు ఆదివారం హైద్రాబాద్ లో తెలుగుయూనివర్శిటి లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు,ఎమెల్సి,నటుడు అద్దంకి దయాకర్ చేతుల మీదుగా అందజేశారు. గోల్డన్ నందితో కూడిన జ్ణాపిక,ప్రశంస పత్రాన్ని అందజేశారు. కొన్ని దశబ్ధాలుగా పెట్రో వ్యాపార రంగంలో రాణించడంతోపాటు స్వచ్చంధ సేవా కార్యక్రమాలనునిర్వహిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఖమ్మం నగరంలో మహిళా ఎంట్రప్రెజర్ గా గత రెండు దశబ్దాలుగా ఆమె పెట్రోల్ బంక్ ను నడిపిస్తున్నాను. పురుషులు నిర్వహించే వ్యాపారంలో ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఐ వో సి డీలర్ షిపు తీసుకొని ఖమ్మం నగరంలో బొనకల్ రోడ్డులో విజయవంతంగా పెట్రోల్ బంక్ ను నడిపిస్తున్నారు.ఆమె భర్త (డా.కూరపాటి వెంకటేశ్వర్లు) డాక్టర్ కావడంతో ఆయన ఆసుపత్రికే పరిమితం కావడంతో ఆమె మేనేజర్ లేకుండానే వ్యాపార లావాదావేవిలను స్వయంగా అని తానే నిర్వర్తిస్తూ మరో 15మందికి ఉపాధి కల్పిస్తున్నారు.ప్రస్తుతం ఖమ్మం జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.2001 మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా అప్పటి టిడిపి పార్టీ తరుపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో అపజయం పొందారు.ఆ తరువాతనే ఆమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా రాణిస్తున్నారు.కోవిడ్ సమయంలో ఎంతో మంది బాదితులకు నిత్యవసర సరుకులను అందజేసి సహాయపడ్డారు. ప్రతి ఏటా తమ పెట్రోల్ బంక్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు వస్తున్నారు. పెట్రోడీలర్స్ అసోసియేషన్ తరుపున కూడా అనేక స్వచ్చంధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఖమ్మం నగరంలో మున్నేరు వరదల సమయంలో వరద బాదితులకు బ్లాంకెట్లను పెద్త ఎత్తున్న పంపిణి చేశారు.వ్రద్దాశ్రమంలో అనాదలకు అవసరం అయ్యే దుప్పట్లను,టవళ్ళను ,ప్లేట్లను కూడా పంపిణి చేశారు.ఐ ఎం ఏ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఇతర స్వచ్చంధ సంస్దలు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు.మహిళలకు సంబంధించి జాగ్రతం చేసే పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను పెట్రోల్ ను పొదుపుగా వాడకం పై అవగాహన కార్య క్రమాలను కూడా నిర్వహించారు.తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి మరియు తెలంగాణ భాష సంస్క్రతిక శాఖ మరియు మాక్షా గ్లోబల్ ఫౌండేషన్ ,ఎం జి ఎఫ్ టి వి యజమాన్యాన్నికి కూరపాటి మంజుల ప్రత్యేక క్రతజ్ణతలు తెలిపారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird