క్రీడా సదుపాయాల దిశగా మంత్రి తుమ్మల అడుగులు*రూ.8.50కోట్లతోఅంతర్జాతీయ ప్రమాణాల అథ్లెటిక్ ట్రాక్ *పటేల్ స్టేడియంలో శరవేగంగా నిర్మాణ పనులు *పది రోజుల్లో అందుబాటులోకి రానున్న ట్రాక్*జాతీయ,అంతర్జాతీయ పోటీలకు వేదికగా సర్దార్ పటేల్ స్టేడియం*ఖమ్మం యువత, క్రీడాకారుల్లోఆనందోత్సాహాలుఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం త్వరలో అత్యాధునిక క్రీడా సదుపాయాలతో కొత్త రూపుతో క్రీడలకు నూతన వేదికకానుంది. క్రీడాకారులకుఅంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ కల్పించాలనే లక్ష్యంతో మంత్రితుమ్మలనాగేశ్వరరావు రూ.8.50 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్,ట్రాక్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ పనులు శరవేగంగా సాగుతుండగా, మరో పది రోజుల్లో పూర్తి చేసుకొనిఅందుబాటులోకి రానుంది. ఖమ్మం నగరంలోని సర్దార్,పటేల్,స్టేడియంలో అత్యాధునిక సౌకర్యాలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ట్రాక్ నిర్మాణానికిశంకుస్థాపన జరిగింది. సుమారు రూ.8.50కోట్లవ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఖమ్మం స్టేడియం జాతీయ,అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు అనువైన వేదికగా మారనుంది.క్రీడా సదుపాయాల దిశగా తుమ్మల అడుగులు….ఖమ్మంజిల్లాక్రీడాకారులను ప్రోత్సహించేందుకు మంత్రితుమ్మలనాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని స్టేడియాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని లక్ష్యంగాపెట్టుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయప్రమాణాలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్,నిర్మాణానికిశ్రీకారంచుట్టారు.క్రీడాకారులకు అవసరమైన శిక్షణా వేదికలు, ఇతర సౌకర్యాలనుసమకూర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.సింథటిక్ ట్రాక్‌తో అద్భుతప్రయోజనాలు….సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణంవల్లక్రీడాకారులకు మెరుగైన శిక్షణ అవకాశాలులభించనున్నాయి. ఈ ట్రాక్ మన్నికైన, స్థిరమైన మరియు సురక్షితమైన ఉపరితలాన్ని కలిగి ఉండటం వల్ల అథ్లెట్లు వేగవంతమైనసమయాలను సాధించడానికి సహాయపడుతుంది. అలాగే గాయాల ప్రమాదం తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వాతావరణపరిస్థితుల్లో కూడా ఈ ట్రాక్‌పై శిక్షణ కొనసాగించవచ్చు. కనీస నిర్వహణతోనే దీర్ఘకాలంఉపయోగించుకునేలాఇదిరూపొందించబడింది.సహజ మట్టి ట్రాక్‌తో పోలిస్తే సింథటిక్ ట్రాక్ అథ్లెట్లకు మెరుగైన ఉపరితలం, సౌకర్యం అందిస్తుంది. మట్టి ట్రాక్‌పై సాధన చేసి సింథటిక్ ట్రాక్‌పై పోటీల్లోపాల్గొన్నప్పుడు సుమారు 1.5 నుండి 2 సెకన్ల వరకు తేడా రావడం వల్ల పతకాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని క్రీడా నిపుణులుచెబుతున్నారు. అందువల్ల జిల్లా స్థాయి నుంచే సింథటిక్ ట్రాక్‌పై శిక్షణ చాలా అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.క్రీడాకారుల్లో ఆనందం…..సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ వల్ల ఖమ్మం జిల్లా యువతకు అథ్లెటిక్స్‌లో మరింత ప్రోత్సాహంలభించనుంది. ఇప్పటికే సీఎం కప్–2024 క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు 12 బంగారు పతకాలు సాధించడం విశేషం. సర్దార్,పటేల్,స్టేడియంలో శిక్షణ పొందిన ఈ క్రీడాకారుల విజయాలు జిల్లాలో అథ్లెటిక్స్‌కు ఉన్నప్రతిభనుచాటుతున్నాయి.ఇప్పుడుసింథటిక్,ట్రాక్అందుబాటులోకి వస్తే జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయనిక్రీడాభిమానులుభావిస్తున్నారు.ఖమ్మంనగరంలోఈసౌకర్యాన్నికల్పించేందుకు కృషి చేసిన మంత్రి తుమ్మలనాగేశ్వరరావుకు క్రీడాభిమానులు కృతజ్ఞతలుతెలుపుతున్నారు.ట్రాక్,ప్రత్యేకతలు….*సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్*రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మాణం*అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్ ఏర్పాటు*అన్నివాతావరణాలకు అనుకూలం, *గాయాల ప్రమాదం తగ్గింపు, వేగవంతమైన ప్రదర్శనకు సహకారం*జాతీయ,అంతర్జాతీయ పోటీలనిర్వహణకు అనువైన వేదిక



C.E.O
Cell – 9866017966
