Home Latest News జపాన్ ప్రజలు అంత ఫిట్‌గా ఎలా ఉంటారు? వారి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటంటే..! | జపాన్ ప్రజలు ఎందుకు ఫిట్ గా ఉన్నారు| జపాన్ ప్రజల ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి| జపనీస్ ప్రజలు ఎలా ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంటారు| జపనీస్ ఫిట్‌నెస్ వెనుక ఆరోగ్యకరమైన అలవాట్లు – Jananethram News

జపాన్ ప్రజలు అంత ఫిట్‌గా ఎలా ఉంటారు? వారి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటంటే..! | జపాన్ ప్రజలు ఎందుకు ఫిట్ గా ఉన్నారు| జపాన్ ప్రజల ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి| జపనీస్ ప్రజలు ఎలా ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంటారు| జపనీస్ ఫిట్‌నెస్ వెనుక ఆరోగ్యకరమైన అలవాట్లు – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉంటే ప్రజలు జపనీయులను చెబుతారు. వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. వారి ఆరోగ్యం, వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. జపనీయులు ఎప్పుడూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో, చాలా ఫిట్‌గా కనిపిస్తారని సోషల్ మీడియా నుండి ఎన్నో వార్తల వరకు ప్రతి ఒక్కచోట కనిపిస్తారు.. దీనికి ప్రధాన కారణం వారి జీవనశైలి, ముఖ్యంగా వారి ఆహారం. ఆధునిక కాలంలో ఊబకాయం అత్యంత తీవ్రమైన వ్యాధులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, జపాన్‌లో ఊబకాయం రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యం విషయానికి వస్తే, జపనీయులు ప్రపంచంలో నాల్గవ లేదా ఐదవ స్థానంలో ఉన్నారు. జపనీయులు తమ రోజును చాలా సరళంగా ఉంటూనే శరీరానికి బాగా పోషకాలు ఇచ్చే ఆహారంతో మొదలుపెడతారని చెబుతారు. వారి అల్పాహారం తేలికగా అనిపించవచ్చు, కానీ అది పోషకాలతో నిండి ఉంటుందట.

ఫిట్నెస్ రహస్యం..

జపనీయుల మాదిరిగా ఫిట్‌గా ఉండటం చాలా సులభం. వారి దినచర్యలను ఖచ్చితంగా పాటిస్తే ఇది సాధ్యమేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు. ఇలా ఆచరిస్తే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని అంటారు.

చిన్న ప్లేట్ లో ఆహారం..

మనం ఆహారం తినే సమయంలో, మన ప్లేట్ పరిమాణం మన ఆరోగ్యానికి నేరుగా సంబందం ఉంటుందట. పెద్ద ప్లేట్లు పెట్టుకుంటే అది అతిగా తినడానికి దారి తీస్తుంది. ఇది అనారోగ్యకరమైన కారణమవుతుందట. ఫిట్‌గా ఉండటానికి జపనీస్ లాగా చిన్న ప్లేట్‌లలో తినే అలవాటును అలవర్చుకోవాలట. ఇది అతిగా తినడానికి ఇష్టపడని, ఫిట్‌గా ఉండటానికి.

సీజనల్ ఫుడ్స్..

ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే, ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలని అంటారు. జపనీయులు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సీజనల్ ఆహారాలను తింటారు. వాతావరణం వేడెక్కే ప్రభావం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం, ఎండిన పండ్లు, నువ్వులు, బెల్లం, ఖర్జూరం, ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలైన పండ్లు, పానీయాలు, ఎక్కువగా నీరు త్రాగాలి.

ఆహారం మోతాదు..

మనకు ఇష్టమైన ఆహారం దొరికినప్పుడు ఆకలి తీరిన తర్వాత కూడా ఇంకా తింటూనే ఉంటారు. దీనివల్ల కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జపనీయులు ఇలా చేయరు. వారికి ఆహారం ఎంత నచ్చినా, వారి ఆకలి తీరే వరకు మాత్రమే తింటారు. ఈ అలవాటు వారి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతోందట.

నిద్ర..

దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం, ఎందుకంటే తగినంత నిద్ర లేకపోవడం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యలను సరిచేయండి, ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. జపనీస్ ప్రజలు తమ నిద్ర గురించి చాలా శ్రద్ధగా ఉంటారు.

తినే విధానం..

ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే సరిపోదు; తినే విధానం కూడా ముఖ్యం. మనలో చాలామంది తొందరపడి తింటారు. సరిగ్గా నమలడం మర్చిపోతారు, ఇది తీవ్రమైన హానిని కలిగిస్తుంది. , జపనీయులు ఆహారం తీసుకునేటప్పుడు నెమ్మదిగా ఆహారాన్ని బాగా నమిలి తింటారట.


ఫైనల్ గా..

శరీరాన్ని దీర్ఘకాలికంగా ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే, ఈ జపనీస్ ఫిట్‌నెస్ దినచర్యను పూర్తిగా అనుసరించాలి. ఎటువంటి రాజీలు ఉండకూడదు. అప్పుడే ఫిట్ గా మారతారు.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird