
తెలుగువన్ నిర్వహించిన ‘వాస్తవ వేదిక’ కార్యక్రమంలో ప్రస్తుత మధ్యప్రాచ్య పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచంపై చూపుతున్న ప్రభావంపై విస్తృతంగా చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో జరిగిన ఈ చర్చలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పాల్గొని కీలక అంశాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాత్ర, అంతర్జాతీయ రాజకీయ సమీకరణలపై పీవీ రమేష్ తమ అభిప్రాయాలను నిర్వహించారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని వివరించారు.
యుద్ధాల్లో మతపరమైన అంశాలు కూడా పాత్ర పోషించాయని, దాని ప్రభావం ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని పీవీ రమేష్ పేర్కొన్నారు. “ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా?” అన్న ప్రశ్నను రవిశంకర్ లేవనెత్తగా, ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఎవరిదన్న అంశంపైనా చర్చ జరిగింది. ఇరాన్‌లో ప్రజాస్వామ్య హక్కుల పరిస్థితిపై కూడా చర్చ సాగింది. గతంలో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలనలో మహిళలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండేవని పీవీ రమేష్ తెలిపారు.
ఈ యుద్ధం భారతదేశంపై పడే ప్రభావంపై కూడా రవిశంకర్ ప్రశ్నించారు. యుద్ధం కొనసాగితే పెట్రోలు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది, భారత్ వద్ద చమురు నిల్వలు సుమారు మూడు నెలల వరకు ఉన్నాయని పీవీ రమేష్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం.
అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి దాదాపు కోటి మంది భారతీయులు, వ్యాపార రంగాల్లో పనిచేస్తున్నారని, యుద్ధం మరింత తీవ్రతరమైతే వారికి కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో భారత ఐటీ రంగంలో ఉద్యోగాలపై కూడా మార్పులు వస్తున్నాయని రవిశంకర్. కీలకమైన అనేక, ఆసక్తికర అంశాల కంఠంనేని రవిశంకర్, పీవీ రమేష్ మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో చూడవచ్చు.

C.E.O
Cell – 9866017966

