
-కొనసాగుతున్న ఆయా షేర్ల ప్రభంజనం
-హుక్ స్టెప్ ని ఒక రేంజ్ లో చేసిన నాని
-అసలు నిజం ఇదే
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ రీల్ చూసినా ‘ఆయా షేర్'(Ayaa sher)సాంగ్ ప్రభంజనం కనిపిస్తుంది. నాచురల్ స్టార్ నాని(నాని)లా స్టెప్ వేసి లైక్స్ పొందాలని చూస్తున్న ఆశావాహులకైతే లెక్కే లేదు. అంతలా సదరు సాంగ్ సినీ ప్రేమికుల్లోకి, సోషల్ మీడియా ప్రేమికుల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది. ఇందుకు నాని, అనిరుధ్ ఎంత కారణమో నాని చేత స్టెప్స్ వేయించిన డాన్స్ మాస్టర్ సుధన్ మాస్టర్ అంతే కారణం. సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన ప్రతిభని ప్రపంచానికి తెలిసేలా చాటిచెప్పిన సుధన్ మాస్టర్ గురించి పలు ఆసక్తి కర విశేషాలని ఎక్స్‌క్లూజివ్ గా మా తెలుగు వన్ అందిస్తుంది
సుదాన్ కి డాన్స్ మాస్టర్ గా అవకాశం అంత సులభంగా రాలేదు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు. ఆర్ఆర్ఆర్ నాటునాటు ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర పదకొండు సంవత్సరాలు పని చేసాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత పారడైజ్ తో అవకాశం వచ్చింది. నాని నుంచే వచ్చిన ‘దసరా’ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసాడు. ఆ సమయంలో సుధన్ ప్రతిభని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)గుర్తించి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్‌గా ఫస్ట్ మూవీకే నాని లాంటి బడా హీరోతో, భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం నిజంగా ఆయన టాలెంట్‌లో దాగి ఉన్న గొప్ప విషయం అని చెప్పవచ్చు.
ఆయా షేర్ సాంగ్ కి సంబంధించిన కొన్ని రహస్యాలని కూడా సుదన్ మాస్టర్ చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడుతు సాంగ్ లో నాని గారి లుక్ ఎంత కొత్తగా ఉందో తెలుస్తుంది. కానీ మేకప్ వేసుకోవడం అంతకంటే కష్టం. ఆ గెటప్ కోసం దాదాపు ఒకటి నుండి రెండు గంటల సమయం పట్టేది. జడలు మరియు మేకప్ వల్ల నాని గారికి ఎంతో పెయిన్ వచ్చినా, భారీ గెటప్ వేసుకుని కదలడం కష్టమైనా అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. ఏకాగ్రతతో స్టెప్స్ పూర్తి చేయడానికి మూడు రోజులు కేటాయించారు. ప్రాపర్టీస్ సెట్ చేయడం, జనాన్ని నిలబెట్టడం వంటి పనుల వల్ల ఒక్కో షాట్‌కి దాదాపు 30 నుండి 40 నిమిషాల సమయం పట్టేది.
కొన్ని స్టెప్స్ బాలీవుడ్ నుండి కాపీ చేశారనే విమర్శలు వస్తున్నాయి. మనం ఒక స్టెప్‌ని కాపీ చేయాలన్నా, ఇన్‌స్పైర్ అవ్వాలన్నా ముందు అది చూసి ఉండాలి. కానీ నేను ఆ స్టెప్ చూడలేదు. కొన్నిసార్లు కొరియోగ్రాఫర్లకి సిమిలర్ థాట్స్ రావచ్చు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర 11 ఏళ్లు పని చేశాను. అటువంటి ఫ్లోర్ మూమెంట్స్ నాకు కొత్తేమీ కాదు. అనిరుధ్ గారు ఇచ్చిన మ్యూజిక్ వల్లనే కొరియోగ్రఫీ చేయడానికి మరింత ఎనర్జీ వచ్చింది. ఒక సాధారణ పాటని కూడా మాస్ సెలబ్రేషన్ సాంగ్‌గా మార్చేస్తుందని, ఈ సాంగ్ విషయంలో అదే పేరు సుధన్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్యారడైజ్ ఆగష్టు 21 న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
కూడా చదవండి: Ustaad baghat singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం.. మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి!
సుధన్ మాస్టర్ మాటలని బట్టి ఒక కళాకారుడి వెనుక ఉండే ఏళ్ల తరబడి శ్రమ, పట్టుదల ఎలా ఉంటుందో సుధన్ మాస్టర్ ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. ‘ఆయా షేర్’ కేవలం ఒక సాంగ్ మాత్రమే కాదు, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కష్టమని కూడా అర్ధమవుతుంది. ఇక ప్యారడైజ్ కి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ మా నుంచి వస్తూనే ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా తెలుగు వన్ సినిమా(తెలుగు వన్ సినిమా) ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ కొట్టడంలో కూడా లేటు చేయలేదు.

C.E.O
Cell – 9866017966

