Home సినిమా అప్పుడు పుష్ప 2 కి జరిగింది.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి జరుగుతుంది – Jananethram News

అప్పుడు పుష్ప 2 కి జరిగింది.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి జరుగుతుంది – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-వైరల్ గా నిలిచిన పుష్ప 2 , ఉస్తాద్
-ఈ రెండు సినిమాలకే ఎందుకు
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్’ అని అక్కినేని(అక్కినేని)వారు ‘దేవదాస్'(దేవదాస్)లో పాడిన విషయం తెలిసిందే. అక్కినేని వారు భావోద్వేగంతో పాడటంతో ఒక మనిషి మైండ్ సెట్ నుంచి వచ్చిన సాడ్ సాంగ్ అని చాలా కాలం పాటు చాలా మంది భావించారు. కానీ రోజుల్లో ఆ తర్వా తి పరిపూర్ణత చెందిన సినీ లెజండ్స్ ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ కి సరైన అర్ధం చెప్పారు. ఆ వర్డ్ కి అర్ధం ఏంటంటే నీ ప్రయత్నం నువ్వు త్రికరణ సిద్దిగా చేసావు. కుడి ఎడమ రెండు గొప్పవే. పొరపాటు జరిగి అటుఇటు ఏదో అయ్యింది. నువ్వు మాత్రం ఓడిపోలేదు అనేది సదరు వర్డ్ లో దాగి ఉన్నపెద్ద ఫిలాసఫీ. ఇప్పుడు ఈ అక్షర సత్యాన్నిఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో చూద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat SIngh)..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)పవర్ ప్యాకేజీ నుంచి వస్తున్న మూవీ. ఈ నెల 24 రిలీజ్ డేట్ కావడంతో సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే థమన్(థమన్)నేతృత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు జరగబోతున్నాయి. ఇదేంటి మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్(Devi sriprasad)కదా!. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. బిజిఎం కూడా దేవినేని కదా ఇవ్వాల్సింది. పైగా బిజిఎం లో మాస్టర్. కానీ థమన్ అంటారేంటని అనుకుంటున్నారా! మీరు అనుకునేది నిజమే. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెయ్యాల్సిన రీల్స్ ని దేవికి పంపడంలో జాప్యం జరిగింది. మరో వైపు దేవి ఇప్పటికే ఒప్పుకున్న వేరే ప్రాజెక్ట్స్ కి డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. వీరితో పరస్పర అంగీకారంతో థమన్ కి బిజిఎం బాధ్యతలని అప్పగించారు. ఈ స్వయంగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అధికారకంగా వెల్లడి చేసింది. కానీ సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని కాంట్రవర్సీ ని సృష్టించే వార్తల కోసం అపర మేధావుల్లా కాచుకొని కూర్చున్న వాళ్ళు రంగంలోకి దిగి ఉస్తాద్ మ్యూజిక్ విషయంతో పాటు సినిమా విషయంలో కూడా అందరు నమ్మే టైపులో రూమర్స్ సృష్టిస్తున్నారు.

కూడా చదవండి: kvn productions: మీకే ఎందుకిలా.. ఎలా తట్టుకుంటారో ఏమో


కానీ మూవీ లవర్స్ ఆ మేధావుల రూమర్స్ కి పైన మనం చెప్పుకున్నట్టుగా దేవదాస్ లోని అక్కినేని వారు పాడిన ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ పాటని ఉదహరిస్తూ ‘దేవిశ్రీప్రసాద్, థమన్ ఇద్దరు సంగీత రంగంలో తిరుగులేని సవ్యసాచులు. ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువ చేసే ఉద్దేశ్యం మేకర్స్ కి లేదు. డేట్స్ కుదరకే ఆ విధంగా చెయ్యవలసి వస్తుంది. పుష్ప 2 కి కూడా ఇదే విధంగా మ్యూజిక్ ని దేవి శ్రీప్రసాద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం నుంచి వచ్చిందనే విషయం మర్చిపోకండి అంటూ సినీ అభిమానులు రూమర్స్ వీరులని ఒక ఆట ఆడుకుంటున్నారు.


You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird