Home Latest News ఇరాన్ యుద్ధ వ్యూహంతో యూఎస్, ఇజ్రాయెల్‌లకు భారీ నష్టం | ఇజ్రాయెల్ సైన్యం| దక్షిణ లెబనాన్| ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్| టెహ్రాన్| బీరుట్| ఇరాన్| అంతర్ జాతీయ వార్తలు| అంతర్జాతీయ సంఘం| US| క్షిపణులు| అమెరికా| ఆత్మహత్య డ్రోన్లు| పేట్రియాట్ క్షిపణి – Jananethram News

ఇరాన్ యుద్ధ వ్యూహంతో యూఎస్, ఇజ్రాయెల్‌లకు భారీ నష్టం | ఇజ్రాయెల్ సైన్యం| దక్షిణ లెబనాన్| ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్| టెహ్రాన్| బీరుట్| ఇరాన్| అంతర్ జాతీయ వార్తలు| అంతర్జాతీయ సంఘం| US| క్షిపణులు| అమెరికా| ఆత్మహత్య డ్రోన్లు| పేట్రియాట్ క్షిపణి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


యుద్దంలో ఇరాన్ అంతుపట్టని వ్యూహాలతో యూఎస్, ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కరి అవుతున్నాయి. సొరంగాల్లో… ఆయుధ సంపత్తి చాలానే దాచుకుంది ఇరాన్. ఇలాంటి అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీలు ఇరాన్ దగ్గర చాలానే ఉన్నాయ్. అమెరికా, ఇజ్రాయెల్ కు ఇవి దొరకవు. నాశనం కూడా కావు. ఈ మిస్సైల్స్ బయటకు వచ్చాయంటే డైరెక్ట్ ఎటాకింగ్ కే వెళ్తుంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ అందుకే సర్వైవ్ అవుతోంది. ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను భూగర్భంలో వందల అడుగుల లోతులో ఉన్న సొరంగాల్లో దాచింది. నాయకులు ఉన్నా లేకపోయినా యుద్ధం మొదలైందంటే ఈ సొరంగాల నుండి క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్, అమెరికాలపై యుద్ధంలో ఇరాన్‌ కొత్త పంథా అవలంభిస్తోంది. తాను ఖర్చు ఎక్కువ చేయకుండానే… ప్రత్యర్థికి భారీ నష్టం కలిగింది. శత్రువు జేబులను ఖాళీచేసి…వారిని అలసిపోయేలా చేయడమే ‘అట్రిషన్‌ వార్‌’ వ్యూహ పద్ధతి. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా, ఇజ్రాయెల్‌లను ఇరాన్‌ చౌకైన డ్రోన్‌లతో ఎదుర్కొంటోంది. అవే షాహెద్‌-136 వన్‌వే అటాక్‌ డ్రోన్లు. ఇవి చిన్న క్రూయిజ్‌ మిస్సైళ్లలా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు.

ఒక్కో డ్రోన్‌ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు 20 వేల డాలర్లు అంటే రూ.16 లక్షలు. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా.. వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం రూ.కోట్లు దాటుతోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌ వ్యవస్థ ఐరన్‌ డోమ్‌లో ఒక్క క్షిపణి ధర రూ.35-45 లక్షల వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్‌వైండర్‌ క్షిపణుల ధర మరింత ఎక్కువ.
ఇక అమెరికా ఇంటర్‌పేట్రియాట్‌ మిస్సైల్‌ వ్యవస్థల్లో ఒక్క సెప్టెంబరు క్షిపణి ధర రూ.30 కోట్లకు పైగానే ఉంటుంది.

అంటే రూ.16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు రూ.30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి. ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్‌లోని దేశాల్లో నిల్వలు తగ్గుతున్నాయని కొన్ని అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. ఇరాన్‌ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు తయారుచేసి ప్రయోగిస్తే, అమెరికా- ఇజ్రాయెల్‌లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird