
నందమూరి బాలకృష్ణ అంటే ఒక ఫెరోషియస్ హీరో.. తన డైలాగులతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేయగల నటుడు. అదే సమయంలో చక్కని కామెడీ టైమింగ్ కూడా ఉన్న నటుడు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో అత్త మరదళ్లను కవ్విస్తూ.. వారితో చేసే విన్యాసాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ తరహా సినిమాలు బాలకష్ణ కెరీర్లో చాలా చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. బాలకష్ణ, శోభన, నిరోషా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
1990లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యేనాటికి బాలక ష్ణ, కోదండరామిరెడ్డి యాక్షన్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు చాలా చాలా అనిపించింది. ఈ సినిమా ఆద్యంతం ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో డాన్సులు, ఫైట్స్ ఈ సినిమాలో ఉండవు. సినిమా అంతా ఎంతో సరదాగా, అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో నడిచిపోతుంది. ఈ సినిమాలో సరదా సరదాగా సాగే కొన్ని సన్నివేశాలతో కూడిన వీడియో మీకు అందజేస్తుంది.
ఈ కథలో శేషారత్నం అధికారాన్ని చలాయిస్తూ భర్తను, తన కూతుళ్లను అదుపులో పెట్టుకుంటుంది. అదే సమయంలో ఊరి నుంచి వచ్చిన మేనల్లుడు వెంకన్న(బాలకృష్ణ)తో చిన్నచూపుగా మాట్లాడుతుంది. వెంకన్న మాత్రం ఎంతో ఉత్సాహంగా అత్తను, మరదళ్లను ఏడిపిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలోనే తన కూతుళ్లను ఒక పల్లెటూరి నాటు మనిషికి ఇచ్చి పెళ్లి చేసుకున్న కర్మ తనకు పట్టలేదని, తన కూతుళ్లను మోసం చేసే అర్హత కూడా అతనికి లేదని అవమానిస్తుంది. దానికి బాలయ్య తనదైన స్టయిల్లో ‘నీ అహంకారాన్ని తగ్గించి, నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకునేలా చేస్తాను’ అని ఛాలెంజ్ చేశాడు.
అత్తతో ఆ అల్లుడు ఎలా ఆడుకున్నాడు, మరదళ్లతో ఎలాంటి సరసాలు సాగించాడు అనే ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ‘మొగుడి మాటలు కాదని కుక్కల మాటలు, పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి’ అని కైకాల చెప్పే డైలాగ్, మరదళ్లు పందెం వేసుకున్న సందర్భంలో ‘నేను గెలిస్తే పెళ్లయిన తర్వాత నువ్వు మా ఆయన్ని ఏమీ అనకూడదు’ అని ఒక మరదలు అంటే, ‘మరి మీ ఆయన నా మీద సరదా పడితే నేను కాదనను’ అని మరో మరదలు చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది సత్యనారాయణ. ప్రేక్షకులు, నందమూరి అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ బాంధవ్యాలను తెలియజెప్పే సీన్స్ కూడా ఇందులో ఉంటాయి. నీతిని కాపాడే ఒక ధీరోదాత్తుడైన అల్లుడి పాత్రలో బాలక ష్ణ జీవించాలనే చెప్పాలి. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ వీడియో క్రింద ఇస్తున్నాం. చూసి ఆనందించండి. ఇలాంటి వినోదాత్మక వీడియోల కోసం తెలుగు సినిమాను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

C.E.O
Cell – 9866017966
