
బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో బొత్స సత్యానారాయణ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రిపాలు కావడంపై వైసీపీ నేతలతో పాటు రాజకీయాలకు కూడా అతీతంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా త్వరగా ఆకాంక్షించారు.

C.E.O
Cell – 9866017966

