జననేత్రంన్యూస్.హమకొండ.జిల్లాప్రతినిధిజులై18*//:కొద్దిరోజుల్లో జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలోని పద్మశాలి భవన్ లో నియోజకవర్గంలోని పరకాల నడి కూడా మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగేదని ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి జరుగుతుందన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వల్లమాలిన హామీలు ఇచ్చిందని వాటిని తీర్చలేక నానా తంటాలు పడుతుందని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్క హామీని తీర్చింది లేదని ఆయన మండిపడ్డారు 19 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఊహించని రీతిలో వ్యతిరేకత ఏర్పడిందని దాన్ని ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలంగాణలోని మారుమూల గ్రామాలకు తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలన్నారు గతంలో పదేళ్ళు పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిలకు 19 నెలల కాంగ్రెస్ పాలనలిని దుస్థితిని ప్రతి కార్యకర్త సైనికునివలె పనిచేసి ప్రజలకు వద్దకు చేర్చాలన్నారు పరకాల నియోజకవర్గం లోని ప్రతి బి ఆర్ ఎస్ కార్యకర్త సమన్వయంతో పనిచేసే ఎన్నికలలో గెలవాలని పిలుపునిచ్చారు అంతర్గతంగా చర్చించుకుని ఐక్యంగా ముందుకు సాగే గ్రామాలలోని ప్రజల మద్దతును పొందాలన్నారు అలాంటప్పుడే ప్రజలు మనల్ని గుర్తించి ఓటేసి గెలిపిస్తారని గుర్తుంచుకోవాలన్నారు పరకాల నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి లేకుండా కక్షపూరితంగా స్థానిక ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తాను చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికి పరకాలలో కనిపిస్తున్నాయని ఆయన తన పదవి కాలంలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేశారు ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు పరకాల నియోజకవర్గ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీని మట్టి కనిపించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భ్రమరోతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని ఎలాంటి కష్టం వచ్చినా తాను ముందుండి వారి ఇంటిలో భరోసా నింపి పని చేయించుకుంటానని ఆయన అన్నారు గతంలో తాను కొన్ని తప్పులు చేసి ఉంటే ఉండొచ్చు కానీ అవి తెలిసి చేయలేదని అన్నారు అందరిని సమానంగా చూసి పనిచేయడానికి ఎన్నో నేర్చుకున్నానని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు కార్యకర్తల మనోభీష్ట మేరకు ఇకముందు పనిచేసే కష్టపడే కార్యకర్తలకు మంచి అవకాశాలను అందిస్తానని ఆయన అన్నారు ఎన్నికలలో పోటీ పడడమే కాకుండా గెలిచే అభ్యర్థులను గుర్తించి వారిని గెలిపించుకొని పార్టీ గౌరవాన్ని పెంపొందించాలని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలు కోరారు ఈ కార్యక్రమంలో పరకాల నడి కూడా మండలాలకు చెందిన అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి చింతి రెడ్డి మధుసూదన్ రెడ్డి తో పాటుగా పార్టీ ముఖ్య నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ చైర్మన్లు తోపాటు రెండు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
