జననేత్రం న్యూస్ నందిగామ నియోజకవర్గం ప్రతినిధి జులై15*//:నందిగామబార్అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణి బాబు. దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించిమణిబాబుమాట్లాడుతూ 1909 జులై 15 తేదీన రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకు న్నారు, బాల్యవివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు,12 సం:రాల వయసులో హిందీ ప్రావీణ్యాన్ని సంపాదించారు.స్వాతంత్ర సమరం లో మహాత్మా గాంధీజీ కి చందాలు వసూలు చేసి ఇచ్చేటప్పుడు తన చేతులకు ఉన్న బంగారు గాజులు కూడా ఇచ్చింది.ఆ విధముగా గాంధీజీతో పరిచయం ఏర్పాటై, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే గాంధీజీ సభలకు హిందీ నుండి తెలుగు అనువాదంగా పని చేసినారు.చెన్నై హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభలను వారు స్థాపించినారు. భారత దేశ ప్రణాళిక సంఘం సభ్యురాలుగా పనిచేశారు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటీ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయినారు. ఎం. ఏ. బి. ఎల్ చేసి న్యాయవాది వృత్తిని మద్రాస్ హైకోర్టులో ప్రారంభించారు. 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యులుగా పని చేసినారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పని చేసినారు. 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందినారు అని మణి బాబు తెలిపారు


C.E.O
Cell – 9866017966
