Home Latest News డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి మంచి స్పందన.

డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి మంచి స్పందన.

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్. హనుమకొండ జిల్లా బ్యూరో జులై07*//:పరకాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో గల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ను తెలుసుకోవడం కోసం ప్రతి సోమవారం డయల్ యువర్ కమిషనర్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పరకాల మున్సిపాలిటీ కమిషనర్ కడారి సుష్మ తెలిపారు అందులో భాగంగా సోమవారం పరకాలలో ఆమె ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు పట్టణానికి చెందిన సుమారు 15 మంది డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో పాల్గొని వారి వారి వార్డులలో ఉన్న సమస్యలను వివరించారు ప్రజల నుంచి డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి మంచి స్పందన ఉందని ఆమె తెలిపారు పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉన్నాయని ఆ వార్డులలో నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడంతో పాటు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే అవకాశం జరుగుతుందని అన్నారు పారిశుద్ధ్యం విద్యుత్తు మంచినీరు మురుగు కాలువల నిర్వహణ లాంటి ఎన్నో ఫిర్యాదులు డయల్ యువర్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయన్నారు ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird