*జననేత్రం న్యూస్ నందిగామ ప్రతినిధి జూలై04//: స్వాతంత్ర్య సమరయోధుడు అమర వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకొని నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా రెవిన్యూ డివిజనల్ అధికారి *శ్రీ కె. బాలకృష్ణ* , కార్యాలయం ఆవరణలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
“బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సశస్త్ర పోరాటం చేసిన అల్లూరి ఈ దేశ గర్వకారణం. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాలుగోన్నారు.



C.E.O
Cell – 9866017966
