విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) లో రేడియోగ్రఫీ విభాగం తీవ్ర విమర్శల దాకా వచ్చింది. మార్చి 2025లో ట్రామా కేసులకు సంబంధించిన కీలకమైన X-Ray రిపోర్టులు మిస్సవడం, విభాగ నిర్వహణలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ట్రామా రేడియోగ్రాఫర్లు తమ కర్తవ్యాలను తప్పించుకుని, సాధారణ (జెనరల్) రేడియోగ్రాఫర్లపై ట్రామా డ్యూటీలు నెట్టివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఉన్నతాధికారుల మౌన సమ్మతి ఉందన్న వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి.
సరిగా డ్యూటీల నిర్వహణ లేకపోవడంతో, రోగులు ఎక్స్-రే గదుల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రామా కేర్ మరియు రేడియోగ్రఫీ విభాగాల మధ్య అనుసంధానం లోపించడం, అనుభవం లేని సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వహించడంతో, సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోంది.
మార్చిలో తీసిన ట్రామా ఎక్స్-రే రిపోర్టులు మిస్ అవ్వడం, ఈ సమస్యలకు నిదర్శనంగా మారింది. ఈ విషయం జూన్లో వెలుగులోకి రాగా, రోగులు మరియు వారి బంధువుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక విడతగా చూడకూడదని, విభాగంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలే చెప్పుకుంటున్నాయి. ట్రామా రేడియోగ్రాఫర్లు బాధ్యతలు లేకుండా వ్యవహరించడమే కాక, జెనరల్ సిబ్బందిపై అధిక భారం వేయడం, పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి.
ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, డ్యూటీలను స్పష్టంగా పంచి, బాధ్యతాయుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- మార్స్ మీద మర్మమైన పుర్రె ఆకారపు రాక్, నాసా దాని మూలం గురించి అనిశ్చితంగా ఉంది – Jananethram News
- అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 62 కోట్ల గంజాయి పట్టివేత | భారీ గంజాయి స్వాధీనం| కస్టమ్స్ అధికారులు| బ్యాంకాక్| NDPS| కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం| బంగారు రేకులు – Jananethram News
- నియా వాయిస్ సేకరించడానికి, 26/11 మాస్టర్ మైండ్ తహావ్వుర్ రానా యొక్క చేతివ్రాత నమూనాలను – Jananethram News
- టాప్ ఇండియన్-ఓరిగిన్ డాక్టర్ టు ఎన్డిటివి – Jananethram News

