Home Latest News 3 రోజులలో మస్తానీకుంటకు నీరు విడుదల…. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు*

3 రోజులలో మస్తానీకుంటకు నీరు విడుదల…. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు*

by Jananethram News
0 comments

**మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల*

    *జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోమే10*//:మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు రోజులలో మస్తానీ కుంటకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మలనాగేశ్వరరావుఅన్నారు.
ఆదివారంమంత్రిరఘునాథపాలెం మండలం గడ్డికుంటతండా వద్దగలగ్రావిటీ5కేనాల్,బావోజితండా వద్ద గల రేగులకుంట చెరువు సందర్శించారు.
ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* మంచుకొండ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ద్వారా చెరువులకు నీటి విడుదల చేపడుతున్నామని తెలిపారు.  రేగుల కుంట చెరువు నుండి నీరు సర్ ప్లస్ అయి నల్లకుంట చెరువు, మల్లెపల్లికుచేరుకుంటున్నాయని అన్నారు. 3 రోజుల వ్యవధిలో మస్తానీకుంట, మంచుకొండకు నీరు విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
రూ. 66.33 కోట్ల ఖర్చుతో మంచుకొండ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. తక్కువ ఖర్చుతో అధికంగా ఆయకట్టు సాగు పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తూ, మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ తో 2400 పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. కొత్త పనులను చేపట్టి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
రైతుల సహకారంతో పైప్ లైన్ వేయడం పూర్తిచేస్తున్నట్లు, రాబోయే వానాకాలం పంట సీజన్ నుండి మంచుకొండ ఎత్తిపోతల పథకం క్రింద సాగు నీరు సరఫరా చేస్తామని మంత్రి అన్నారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు,  ఇర్రిగేషన్ ఇఇ అనన్య, డిఇ ఝాన్సీ, ఏడిఏ వెంకటేశ్వర రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird