Home తెలంగాణ వర్గీకరణ విజయం మాదిగ అమరులకు అంకితం

వర్గీకరణ విజయం మాదిగ అమరులకు అంకితం

by Jananethram News
0 comments

*మాదిగ అమరవీరుల నివాళులర్పించిన
ఎమ్మార్పీఎస్ నాయకులు, బీసి సంఘాల నాయకులు *జననేత్రం న్యూస్ ప్రతినిధిమార్చి01*//:ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లో
ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు
ప్రతి సంవత్సరం మార్చ్ 1 వ తేదిని ఎస్సీ వర్గీకరణ పోరాటం లో అశువులు బాసిన మాదిగ అమరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తూ మాదిగ అమరులకు నివాళి అర్పించడం జరుగుతుంది.
అందులో భాగంగా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లో ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ
మాదిగ అమరవీరుల, త్యాగాలను, మాదిగ జాతి మరువదు అని గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పునిచ్చిన వెంటనే ఎమ్మార్పియస్ అధినేత మంద కృష్ణ మాదిగ గారు ఢిల్లీ లోనే
30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు, ఆ విజయాన్ని అంకితం ఇస్తున్నామని సుప్రీంకోర్టు సాక్షిగా ప్రకటించారు అని మాదిగ అమరవీరుల ఆశయాలు సాధించడం అంటే వర్గీకరణ విజయాన్ని మాదిజాతికి, భవిష్యత్ తరాలకు, అందించడమే నిజమైన నివాళులు అని
తెలంగాణ రాష్ట్రంలో అమలుకు తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ముందుకు సాగడం హర్షనీయమని ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిలుగా అమలు చేయాలని సంపూర్ణంగా శాస్త్రీయంగా ఎస్సీల్లో 58 కులాలకు సమాన న్యాయంగా అమలు చేయాలి అని అన్నారు. ‘వీరులకు మరణం లేదు
జగతి ఉన్నంత కాలం
స’జీవంగా జీవించే ఉంటరు.’ అని
అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదని పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ విడువదు అని
అమరులు చిందించిన నెత్తుటి చుక్కల సాక్షిగా ఎస్సి వర్గీకరణను సాధించాం.. అది సంపూర్ణంగా ఉండేలా జాతి కోసం, సమాజ హితం కోసం మాన్యులు మందకృష్ణ మాదిగ గారి సారధ్యంలో మాదిగ అమరుల యాదిలో.. ఆశయాల దారిలో శ్రమిస్తాం.. భవిష్యత్తు తరాలకు అమరుల త్యాగాలను చరిత్రగా అందిస్తాం..! అని వర్గీకరణ పోరాటం లో అశువులు బాసిన
తెలబండ్ల రవి మాదిగ
సిర్రా నాగేశ్వరరావు మాదిగ
మీరా సాహెబ్ మాదిగ
గింజారపు ప్రభాకర్ మాదిగ
పొన్నాల సురేందర్ మాదిగ
నడిమిండ్ల దామోదర్ మాదిగ
ములుగు మహేష్ మాదిగ
దర్శనాల భారతి మాదిగ
పెద్దాడ ప్రకాష్ రావు మాదిగ
యుద్ధం చేస్తూ అమరత్వం పొందిన వాళ్ళు వీరైతే, ఎందరో పోరాట వీరులు ఉద్యమిస్తూ అనారోగ్య కారణాల రీత్యా అసువులు బాశారు వారందరికీ నివాళులు ఆర్పిస్తున్నాం..
వారు చేసిన త్యాగాలను యాది చేస్తూ ఘనంగా స్మరిస్తున్నాం..
30 ఏండ్లు, ఒక తరం ఈ ఉద్యమంలో భాగమై ‘మందకృష్ణన్న’ పిలుపు మేరకు శ్రమించారు వారందరికీ ఉద్యమ జేజేలు పలుకుతున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
మండల ఇంచార్జీ మందుల లింగ స్వామి మాదిగ,
మండల కన్వీనర్ పందుల భిక్షపతి మాదిగ,
సీనియర్ నాయకులు గట్టు రాములు మాదిగ,
వేముల నర్సింహ్మా మాదిగ,
బీసి సంఘం నాయకులు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ,
వెనుక బడిన వర్గాల సిద్ధాంత నాయకుడు బ్రహ్మ చారి,గాయకులు గంధమల్ల శివ శంకర్ మాదిగ,ఎలగందుల విజయ్ పద్మశాలి ,శిగ మల్లేష్ గౌడ్, గజ్జెల్లి పవన్ మాదిగ,
జి గణేష్ మాదిగ, ముత్తయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక ఉద్యమ నమస్కారాలతో…

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird